![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -413 లో.. ముకుందని శోభనం కోసమని రేవతి రెడీ చేస్తుంది. త్వరగా మాకు పాపనో బాబునో ఇవ్వాలని రేవతి అనగానే.. ఇస్తాను ఎవరు కావాలని ముకుంద అడుగుతుంది. నన్ను కాదు మీ అత్తయ్యని అడుగు అని రేవతి అనగానే.. మా అత్తయ్య మీరే అని ముకుంద అంటుంది. ఎప్పటికైనా నేను నా కడుపున మోసేది మీ కొడుకు మురారి బిడ్డనే అని ముకుంద తన మనసులో అనుకుంటుంది.
ఆ తర్వాత మురారి రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటూ అచ్చం శోభనం పెళ్లి కొడుకు లాగే రెడీ అయ్యావ్ కానీ జరిగేదేం ఉండదు.. ఓన్లీ యాక్టింగ్ అని మురారి డిస్సపాయింట్ గా మాట్లాడుకుంటాడు. అప్పుడే మధు వచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. ఇంకొకసారి చెప్పు అని, మరొకసారి చెప్పు అని అలా చాలాసార్లు మధు చేత అల్ ది బెస్ట్ చెప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆదర్శ్ దగ్గరికి మధు వెళ్తాడు. మధు వెళ్లేసరికి.. ముకుంద ఫోటో చూస్తు ఆదర్శ్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. నువ్వు, మురారి ఇద్దరు వాళ్ళకి భర్తలుగా దొరకడం వాళ్ళ అదృష్టమని మధు అంటాడు. వాళ్లు మాకు దొరకడం మా అదృష్టం కదా అని ఆదర్శ్ అంటాడు. అప్పుడే ఆదర్శ్ ఫ్రెండ్స్ కాల్ చేసి పార్టీకి డబ్బులు కావాలని అడుగుతారు. అదే విషయం మధుకి చెప్తాడు. మరి నాకు పార్టీకి డబ్బులు ఇవ్వడం లేదేంటని మధు అనగానే.. తనకి కూడా ఇస్తాడు.
ఆ తర్వాత కృష్ణ రెడీ అవుతుంటుంది. ముకుంద పౌడర్ డబ్బా తీసుకొని వచ్చిన విషయం చెప్పింది గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే రేవతి వస్తుంది. ముకుంద ఏం అంటుంది ఇబ్బందిగా ఫీల్ అవుతుందా అని రేవతిని కృష్ణ అడుగుతుంది. తను బాగుంది నీలాగా మాత్రం తొందరపడట్లేదని రేవతి అంటుంది. నేను ఏసీపీ సర్ దగ్గరికి వెళ్తానని కృష్ణ అనగానే.. ఆగు ఇంకా టైమ్ ఉందని సుమలత అంటుంది. అయ్యో మీకు అలా అర్థం అయిందా అని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత మురారి ఉన్న గదిలోకి కృష్ణ పాలగ్లాస్ తో వెళ్తుంది. ఆదర్శ్ అంటే ఇష్టం లేదని ముకుంద చెప్తుంది కావచ్చని టెన్షన్ పడుతుంది. మరొకవైపు ఆదర్శ్ దగ్గరికి ముకుంద పాలగ్లాస్ తో వెళ్తుంది. ముకందని చూసి ఆదర్శ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |